Tailoring Business topics mudhra videos



                          టైలరింగ్  బిజినెస్ టిప్స్ 

      
 హాయ్ ఫ్రెండ్స్  టైలరింగ్ కొత్తగా నేర్చుకున్నవారు దానిని వ్యాపారం గా ఎలా మలుచుకోవాలి 

టైలరింగ్ కొత్తగా  నేర్చుకున్నవారు,  ఇంటిలోనే  టైలరింగ్ మిషన్ పెట్టుకోని మొదటిగా మీ         ఇంటిదగ్గర వారికి , మీకు తెలిసిన వారికి, బట్టలు కుట్టిఇవ్వండి . 

మీ ఏరియా లో  స్కూల్స్,  కాలజీస్ ఉంటె టీచర్స్ దగ్గరకు వెళ్లి వారికి చెప్పండి .  మీరు అన్నీ 
రకాల లేడీస్ ఐటమ్స్  అందంగా  కుట్టి ఇస్తాము అని.  వారి దగ్గరా  ఆర్డర్స్  తీసుకోండి . 

మీరు ఎప్పుడూ తక్కువ రేటు కి కుడతాము  అని చెప్పకండి , అందం గా కుట్టి మీరు చెప్పిన 
టైంకి  ఇస్తాము అని చెప్పండి . 

మనం తక్కువ రేట్ కి అలవాటు చేస్తే వారి దగ్గర ఎప్పటికి ఎక్కువ ధర  తీసుకోలేము 
మీరు ఎప్పుడైతే ఎక్కువ ధర చెప్తారో వారు ఇక మన దగ్గర కుట్టించుకోవటానికి ఇష్టపడరు. 

మీరు మీ ఏరియా లో  స్టిట్చింగ్ ధరలు ఎలావున్నాయో  కనుక్కుని  అంత  ధర  మీరు కూడా 
తీసుకోండి . 

ఎప్ప్పుడూ కూడా కస్టమర్ చెప్పిన టైమ్ కి మనం వారికి డెలివరీ ఇస్తే మీ వ్యాపారం లో ఎదుగుదల  ఉంటుంది . 

మీ దగ్గరకు కస్టమర్స్ ఎక్కువగా రావటం స్టార్ట్ అయిన తరువాత , అప్పుడు మీకు దగ్గరగా చిన్న 
షాప్ తీసుకోండి . 

సపరేటేగా షాప్ ఉంటే మీకు  వ్యాపారం   ఎక్కువ పెరుగుతుంది 

అదీ కూడా మెయిన్ రోడ్ లో అవసరం ఉండదు,  కొంచం లోపలకి  ఉన్నా  పర్లేదు  అద్దె 
తక్కువ ఉంటుంది. షాప్ తీసుకున్న మొదటిలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టకండి . 

మీకు బాగా వ్యాపారం పెరిగిన తరువాత  అప్పుడు ఇంకొక  మనిషిని  పెట్టుకుని  మరొక మిషన్ 
పెంచుకోండి . ఆలా మీ వ్యాపారం అభివృద్ధి చెందే కుంది మీరు మిషన్స్ పెంచుకోవాలి . 

ఆ తరువాత మెయిన్ సెంటరులో  షాప్ తీసుకోండి . అప్పుడు కొంచం పెట్టుబడి పెట్టినా మీకు 
అది త్వరగా నే తిరిగి వస్తుంది . 

ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే ఇక్కడ  Click  చేయండి . 

        

         
                              


.  


         

Comments